పీకే సర్టిఫికెట్ నాకెందుకు ?

ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) సర్టిఫికెట్ తనకు అక్కర్లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. అంతకు ముందు పీకే సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్త ఆలోచన, కొత్త ప్రయత్నాలలో బీహార్ అభివృద్ధి, సంక్షేమానికి కృషి చేస్తానని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన స్టేట్ మెంట్ చూస్తే నవ్వొస్తుందని నితీష్ వ్యాఖ్యానించారు. ప్రశాంత్ కిషోర్ అభిప్రాయాలు ఇక్కడ ముఖ్యం కాదు. బీహార్ ప్రజలకు తాను ఏం చేసానో ప్రజలందరికీ తెలుసునని నితీష్ అన్నారు. ఎవరు ఏమైనా ప్రకటనలు చేయవచ్చు.నిజాలు ఏమిటో ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి పీకే అభిప్రాయాలను తానేమి పట్టించుకోవడం లేదన్నారు. 30 ఏళ్ల నితీష్ కుమార్, లలూ ప్రసాద్ యాదవ్‌ల పాలన వల్లే బీహార్ వెనుక బడిపోయిందని ప్రశాంత్ కిషోర్ ఆరోపణలు చేశారు.
Tags :