విమానాలపై ఆంక్షలు తొలగింపు ..అక్టోబర్ 18 నుంచి

విమానాలపై ఆంక్షలు తొలగింపు ..అక్టోబర్ 18 నుంచి

ఈ నెల 18వ తేదీ నుంచి దేశీయ విమానాల్లో ప్రయాణికుల సంఖ్యపై పరిమితులను తొలగిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ తెలిపింది. విమాన షెడ్యూల్స్‌ పరిస్థితి, పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కోవిడ్‌ ఆంక్షల కారణంగా విమానాల్లో ప్రయాణికుల సంఖ్యపై పరిమితి జూన్‌ 1లో 50 శాతంగా ఉండగా క్రమక్రమంగా సెప్టెంబర్‌ 18వ తేదీకి 85 శాతం మేరకు పెంచినట్లు తెలిపంది. ప్రభుత్వం నిర్ణయాన్ని దేశీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి.

 

Tags :