వెస్ట్ మినిస్టర్ హాల్లోకి చైనాకు నో ఎంట్రీ!

వెస్ట్ మినిస్టర్ హాల్లోకి చైనాకు నో ఎంట్రీ!

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌ 2 పార్థివదేహానికి నివాళులర్పించేందుకు వస్తున్న చైనాకు తీరని అవమనం ఎదురైంది. రాణి శవపేటిక ఉన్న పార్లమెంట్‌ కాంప్లెక్స్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ హాల్‌లోకి ప్రవేశించేందుకు చైనా దౌత్య అధికారుల బృందానికి బ్రిటన్‌ అనుమతి నిరాకరించింది. ఈ బృందంపై నిషేధం విధించినట్లు సమాచారం. తమ దేశానికి చెందిన ఐదుగురు ఎంపీలపై చైనా ఆంక్షలు విధించడంతో పాటు జిన్‌జియాంగ్‌లో ఉయ్‌ఘర్‌ ముస్లిం మైనార్టీల విషయంలో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.

 

Tags :