MKOne Telugu Times Business Excellence Awards

ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు... సెప్టెంబర్ 30 తర్వాత కూడా

ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు...  సెప్టెంబర్ 30 తర్వాత కూడా

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. రూ.2 వేల నోట్లు మార్చుకోవడానికి తొందర పడొద్దని సూచించారు. రూ.2 వేల నోట్లు మార్పిడి కోసం నాలుగు నెలల సమయం ఉందని తెలిపారు. నోట్ల మార్పిడి నేపథ్యంలో బ్యాంకుల వద్ద రద్దీ తగ్గించడానికి సెప్టెంబర్‌ వరకు గడువు ఇచ్చామని పేర్కొన్నారు. లావాదేవీలపై యథావిధిగా నిఘా ఉంటుందని ఆయన వెల్లడించారు. సెప్టెంబర్‌ 30 తర్వాత కూడా 2 వేల నోటు చెలామణి అవుతుందని స్పష్టం చేశారు.  ఇప్పుడే బ్యాంకులను పోటెత్తాల్సిన అవసరం లేదని, ఇంకా నాలుగు నెలల సమయం ఉందని అన్నారు. సెప్టెంబర్‌ 30వ తేదీనే ఎందుకు డెడ్‌లైన్‌గా పెట్టామన్న విషయాన్ని ఆయన చెబుతూ, ఆ తేదీని సీరియస్‌గా తీసుకుని ప్రజలు ఆ నోట్లను వెనక్కి ఇచ్చేస్తారన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్‌ వెల్లడించారు.

 

 

Tags :