ఢిల్లీ లో లాక్‌డౌన్‌ పై సీఎం కేజ్రీవాల్ క్లారిటీ

ఢిల్లీ లో లాక్‌డౌన్‌ పై సీఎం కేజ్రీవాల్ క్లారిటీ

ఢిల్లీలో కరోనా ఉధ్థృతి కొనసాగుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ విధించబోమని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పష్టం చేశారు. ఎవరూ భయపడొద్దు, లాక్‌డౌన్‌ ఉండదన్నారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సమావేశంలో రాజధాని ప్రాంతమంతా ఆంక్షలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వ అధికారులను కోరామని, వారు అందుకు హామీ ఇచ్చినట్టు కేజ్రీవాల్‌ తెలిపారు. దేశ రాజధాని నగరంలో కొవిడ్‌ కట్టడికి ఉన్న అన్ని అవకాశాలనూ అమలు చేస్తున్నారు. ప్రైవేటు కార్యాలయాలను మూసివేసి ఉద్యోగులందరికీ వర్క్‌ ఫ్రమ్‌ హోం ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సేవలకు మాత్రం మినహాయింపు ఇస్తూ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ ఏజెన్సీ నిర్ణయం తీసుకొంది. అలాగే రెస్టారెంట్లు, బార్లను సైతం మూసివేసి టేక్‌ అవే, హోం డెలివరీలకు మాత్రమే అనుమతిస్తున్నట్టు పేర్కొంది.

 

Tags :