రష్యాకు టాటా గుడ్ బై

ఉక్రెయిన్‌పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్తపడ్డాయి. కానీ టాటా గ్రూప్ ఇలా ఊరుకోలేదు. యుద్దం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలకు నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలకు గుడ్‌బై చెప్పింది. టాటా గ్రూప్ ఆధ్వర్యంలో టాటా స్టీల్ పరిశ్రమలు ఉన్నాయి. స్టీలు తయారీలో పల్వ్రైజ్డ్ బొగ్గును వినియోగిస్తారు. ఇంతకాలం ఈ బొగ్గును రష్యా నుంచి టాటా స్టీల్స్ దిగుమతి చేసుకునేంది. అయితే ఉక్రెయిన్‌పై రష్యా దందడయాత్రను నిరసిస్తూ ఆ దేశం నుంచి బొగ్గు దిగుమతి చేసుకోరాదని టాటా స్టీల్స్ నిర్ణయం తీసుకుంది. ఇటీవల రష్యా నుంచి 75 వేల టన్నుల బొగ్గు రష్యా నుంచి టాటా స్టీల్‌కు సరఫరా అయింది. దీంతో రష్యా యుద్ధం నేపథ్యంలో టాటా స్టీల్స్ గతంలో చేసిన ప్రకటన కేవలం ప్రచార ఆర్బాటం తప్ప ఆచరణలో అమలు అయ్యేది కాదనే విమర్శలు ఎక్కువయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన టాటా స్టీల్ రష్యా నుంచి బొగ్గు దిగుమతికి సంబంధించిన వివరణ ఇచ్చింది.