టీడీపీ అధికారంలోకి రాగానే .. ఆ వర్గానికి రాజకీయంగా అవకాశాలిస్తాం

వడ్డెర సామాజిక వర్గానికి రాజకీయంగా అవకాశాలు కల్పించి పైకి తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. నాలుగోరోజు యువగళం పాదయాత్రలో భాగంగా ఆయన వడ్డెర సామాజిక వర్గానికి చెందిన వారితో సమావేశమై వారి సమ్యలను ఆలకించారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ వర్గానికి ఉపాధి అవకాశాలు పెంచుతామని తెలిపారు. తెలుగుదేశం అధికారంలో ఉండగా ఆ సామాజిక వర్గం కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ఆయన వివరించారు. అధికారంలోకి రాగానే అండగా నిలుస్తామని వారికి భరోసా ఇచ్చారు.
Tags :