స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్

స్వాంటే పాబోకు వైద్యరంగంలో నోబెల్ ప్రైజ్

వైద్యశాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ స్వాంటె పాబోను ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారం`2022 వరించింది. మానవ పరిణామక్రమంతో పాటు అంతరించిపోయిన హోమినిస్‌ జన్యువులకు సంబంధించిన ఆవిష్కరణలకుగానూ పాబోకు ఈ బహుమతి దక్కింది. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో  ఉన్న కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లోని నోబెల్‌ బృందం దీనిని ప్రకటించింది. నోబెల్‌ బహుమతి గ్రహీతలకు 10 లక్షల  స్వీడిష్‌ క్రోనర్‌ (సుమారు 9 లక్షల డాలర్లు) నగదు అందుతుంది. వీటిని ఈ ఏడాది డిసెంబర్‌ 10న అవార్డు గ్రహీతలకు అందజేస్తారు. స్వీడన్‌కు చెందిన శాస్త్రవేత్త, ఇంజినీర్‌, వ్యాపారవేత్తగా పేరుగాంచిన ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ పేరు మీదుగా ప్రపంచంలో వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తోన్న సంగతి తెలిసిందే.

 

Tags :
ii). Please add in the header part of the home page.