పద్మ అవార్డుల నామినేషన్ లకు ఆహ్వానం

పద్మ అవార్డుల నామినేషన్ లకు ఆహ్వానం

గణతంత్ర దినోత్సవం 2023 సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల కోసం ఆన్‌లైన్‌ నామినేషన్ లు, సిఫారసు దరఖాస్తుల స్వీకరణ ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రారంభమైనట్లు కేంద్ర హోం శాఖ తెలిపింది. పద్మ అవార్డుల నామినేషన్ లను ఈ ఏడాది సెప్టెంబర్‌ 15 వరకు https://padmaawards.gov.in పోర్టల్‌ ద్వారా స్వీకరిస్తామని తెలిపింది. వివిధ కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, ప్రజాసంబంధాలు, సేవ, సివిల్‌ సర్వీస్‌, వాణిజ్యం, పరిశ్రమ మొదలైన రంగాలు, విభాగాలలో విశిష్టమైన అసాధారణ విజయాలు, సేవలకు ఈ పురస్కారాలు ఇవ్వనున్నారు.

 

Tags :