తానా-క్యూరీ పోటీలకు మంచి స్పందన

తానా-క్యూరీ పోటీలకు మంచి స్పందన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), క్యూరీ లెర్నింగ్‍ సంస్థ కలిసి సంయుక్తంగా మ్యాథ్‍, సైన్స్ బౌల్‍ వార్షిక పోటీలును ఈసారి ఆన్‍లైన్‍లో నిర్వహించారు. ఆగష్టు 22న ఆన్‍లైన్‍ లో జరిగిన ఈ పోటీల్లో 625 మందికిపైగా పిల్లలు పాల్గొన్నారు. పిల్లలు వారి వారి స్కూల్‍ లో చదివే క్లాసులను అనుసరించి 3 గ్రూపులుగా విభజించి, మ్యాథ్‍ బౌల్‍ ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు, సైన్స్ బౌల్‍ మధ్యాహ్నం ఒంటిగంట నుండి రెండు గంటల వరకు నిర్వహించారు. 3, 4 తరగతుల విద్యార్థులు ఒక సమూహంగా 5, 6 తరగతుల విద్యార్థులు ఇంకో సమూహంగా అలాగే 7, 8 తరగతుల విద్యార్థులు మరొక సమూహంగా వర్గీకరించారు.  విజేతల వివరాలను విడుదల చేసేందుకు సెప్టెంబర్‍ 11న ఆన్‍లైన్‍ లో మరో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, పూర్వ అధ్యక్షులు జయ్‍ తాళ్లూరి, క్యూరీ వ్యవస్థాపకులు డాక్టర్‍ రావు మూల్పూరి పాల్గొన్నారు.

విజేతల ప్రకటన అనంతరం అంజయ్య చౌదరి మాట్లాడుతూ తానా నాయకత్వం మున్ముందు కూడా మన తరువాతి తరం పిల్లలకి ఉపయోగపడే కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందన్నారు. ఈ విషయంలో క్యూరీ లెర్నింగ్‍ వారి సహకారం మరువలేనిదని, పిల్లలు ఈ పోటీలలో విరివిగా పాల్గొనడం శుభపరిణామం అన్నారు. మ్యాథ్‍ బౌల్‍ పోటీలు విశ్లేషణాత్మకంగా ప్రాబ్లం సాల్వింగ్‍ స్కిల్స్ ని పెంపొందించేలా, సైన్స్ బౌల్‍ పోటీలు ఆచరణలో ఎలా వర్తించాలో ఆలోచించేలా నిర్వహించడం క్యూరీ లెర్నింగ్‍ ప్రత్యేకత అని అన్నారు. ఇటువంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంచి స్కూల్స్లో రాణించడానికి తానా చేస్తున్న ప్రయత్నాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. ఈ పోటీల నిర్వహణలో ముందునుండి తోడ్పడిన ఠాగూర్‍ మల్లినేని, విద్య కూచిపూడి, గౌరి వేమూరి, శ్రీనివాస్‍ ఉయ్యూరులను అభినందించారు. 

గణితం గ్రూప్1: ప్రథమం-కడవకొల్లు గెష్ణశ్రీ, ద్వితీయ-బత్తుల కృష్ణ, తృతీయ-వైభవ గుణిచెట్టి

గణితం గ్రూప్2: ప్రథమం-హాసిని, షమి, సత్య, శ్రీనందసాయి, ఆర్యన్, ప్రణవ్; ద్వితీయం-అనీష్, తృతీయం-అనిరుధ్, వర్ణిక, రుహాన్

గణితం గ్రూప్3: ప్రథమం-అర్ణవ్, ఆర్యన్, భవ్య, ఈషా, జొవిన, సిరి, తనుష్, ఆదిత్య, తారుణ్; ద్వితీయం-మేధ, సహాన, సాయి, శ్రీవత్స, వేదాంష్, విశాల్; తృతీయ-ఆరవ్, నిశ్చయ్, నిత్య, నివేద్, సుదర్శన్, ఆన్వి, అభినవ్

సైన్స్ గ్రూప్1: ప్రథమం: ధరంపురి ఆర్ణ, ద్వితీయం- హితవ్, తృతీయం-గెష్ణశ్రీ కొడవకొల్లు, సాయి సహస్ర పెరవల్లి

సైన్స్ గ్రూప్2: ప్రథమం-హాసిని, ద్వితీయం-ఆహిర్, భవ్య, ప్రతీక్, సంహిత; తృతీయం-దీక్షిత, అమృత్

సైన్స్ గ్రూప్3: ప్రథమం: జక్కంపుడి శ్రీసాయి, ద్వితీయం-పోలెపల్లె సాయి శ్రీకర్ తృతీయం-ఆర్యన్ రాజ్, రోనవ్ గోపాల్

 

Tags :