అమెరికా యోగా యూనివర్సిటీలో పీహెచ్‌డీ

అమెరికా యోగా యూనివర్సిటీలో పీహెచ్‌డీ

అమెరికాలో వివేకానంద యోగా యూనివర్సిటీ (వీఏవైయూ) పీహెచ్‌డీ ప్రోగ్రాంను ప్రవేశ పెడుతున్నట్లు ప్రకటించింది. మొదటి బ్యాచ్‌లో యూఎస్‌, ఖతార్‌, ఇండియాకు చెందిన పది మంది విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపింది. వీఏవైయూ ఉన్నత విద్య కోసం ఏర్పడిన మొదటి  ఖండాంతర యోగా యూనివర్సిటీ. ఉన్నతవిద్య అభ్యసించాలనుకునే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఎమ్‌ఎస్‌`పీహెచ్‌డీని ప్రవేశపెట్టామని, ఇది యోగా విద్య విస్తరణకు దోహదం చేస్తుందని వర్సిటీ వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రొఫెసర్‌ మురళి వెంకటరావు పేర్కొన్నారు.

 

Tags :