ఉత్తర కొరియాలో లాక్‌డౌన్

కరోనాతో అల్లాడిపోయినా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదంటూ ఇప్పటి వరకు చెప్పుకొచ్చిన ఉత్తర కొరియాలో తాజాగా ఒక కేసు వెలుగు చూసింది. కరోనా వెలుగు చూసిన రెండు సంవత్సరాల తరువాత అక్కడ తొలి కేసు నమోదు కావడం గమనార్హం. అయితే ఒక్క కేసు వెలుగు చూడగానే అప్రమత్తమైన ఉత్తర కొరియా వెంటనే సరిహద్దులు మూసేసి లాక్‌డౌన్ విధించారు. దేశాధినేత కిమ్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు కరోనా కట్టడి చేసే చర్యలు ప్రారంభించారు. రాజధాని ప్యాంగ్యాంగ్‌లో జ్వరంతో బాధ పడుతున్నవారికి కరోనా పరీక్షల్లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది.
Tags :