అమెరికా అధ్యక్షుడికి.. ఉత్తర కొరియా భయం

అమెరికా అధ్యక్షుడికి..  ఉత్తర కొరియా భయం

ఆసియాలో మొట్టమొదటి పర్యటనకు బయలుదేరిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఉత్తరకొరియా భయం పట్టుకుంది. అణు పాటవాన్ని చాటిచెప్పేందుకు ఉత్తరకొరియా ఇటీవల కాలంలో పలుమార్లు క్షిపణి పరీక్షలు జరిపిన విషయం తెలిసిందే. ఆసియా పర్యటన సమయంలోనూ ఆ దేశం  బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం లేదా అణు పరీక్ష జరిపేందుకు కచ్చితంగా అవకాశాలున్నట్లు తమకు సమాచారం ఉందని జాతీయ భద్రతా సలహాదారు జేక్‌ సలివాన్‌ తెలిపారు. బైడెన్‌ దక్షిణ, జపాన్‌లలో ఆరు రోజులు పర్యటిస్తారు. ఈ సందర్బంగా రెండు దేశాలతో మరింత చేరువ కావడంపై దృష్టిని కేంద్రీకరిస్తారు. దీంతోపాటు, ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు మద్దతిస్తున్న చైనాకు గట్టి సందేశం పంపించడమే అధ్యక్షుడు బైడెన్‌  పర్యటనలో ప్రధానోద్దేశమని సలివాన్‌ తెలిపారు.

 

Tags :