MKOne TeluguTimes-Youtube-Channel

భారతీయులకు సత్వర గ్రీన్‌ కార్డు ల కోసం సిఫార్సు

భారతీయులకు సత్వర గ్రీన్‌ కార్డు ల కోసం సిఫార్సు

ఈబీ 1, 2, 3 కేటగిరీల్లో ఐ140 వీసా పిటిషన్లకు ఆమోదముద్ర పడినవారికి ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇచ్చే అంశంపై అమెరికా అధ్యక్షుడి సలహా సంఘం ఒకటి చర్చించింది. ఆసియన్‌ అమెరికన్లు, హవాయి, పసిఫిక్‌ ద్వీప వాసులకు ప్రాతినిధ్యం వహించే ఈ సలహా సంఘం సిఫార్సును అధ్యక్షుడు జో బైడెన్‌ ఆమోదిస్తే విదేశీ నిపుణులకు అమెరికాలో శాశ్వతనివాస కార్డు ( గ్రీన్‌ కార్డు) కోసం నిరీక్షణ  వ్యవధి బాగా తగ్గిపోతుంది. అయిదేళ్ల నుంచి ఈ తరహా వీసా అనుమతి కోసం ఎదురుచూస్తున్న వారికీ ఉద్యోగ సమ్మతి పత్రాలను, ప్రయాణ పత్రాలను ఇవ్వాలని సిఫార్సు చేశారు. సంఘంలోని భారతీయ అమెరికన్‌ సభ్యుడు అజయ్‌జైన్‌ భుటోడియా అమెరికాలో హెచ్‌1 బీ వీసాదారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. వీరికి త్వరగా గ్రీన్‌కార్డులు ఇస్తే ప్రపంచమంతటి నుంచి సైన్స్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌,  గణితాల్లో నిష్ణాతులైనవారిని, వైద్యులను అమెరికా పెద్ద ఎత్తున ఆకర్షించగలుగుతుందన్నారు. వీరి వల్ల అమెరికా ఆర్థికాభివృద్ధికి గొప్ప ఊతం లభిస్తుందన్నారు. 

 

 

Tags :