ప్రవాసీ నిధుల ఆకర్షణలో భారత్ టాప్

ప్రవాసీ నిధుల ఆకర్షణలో భారత్ టాప్

భారత్‌కు 2021 లో విదేశీ నిధులు వెల్లువెత్తాయి. మొత్తం 8,700 కోట్ల డాలర్ల (రూ.6.52 లక్షల కోట్లు) విలువ గల విదేశీ  (ప్రవాసీ) నిధుల రాకతో భారత్‌ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచింది. నిధుల్లో 20 శాతం వాటాతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది. నిధుల రాకతో భారత్‌ తర్వాతి స్థానాల్లో చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్‌, ఈజిప్ట్‌ ఉన్నాయని ప్రపంచ బ్యాంక్‌ ఒక నివేదికలో తెలిపింది.  2022లో భారత్‌కు వచ్చే నిధులు 3 శాతం పెరిగి 8,960 కోట్ల డాలర్లకు రూ.రూ.6.72 లక్షల కోట్లు) చేరగలవని అంచనా వేసింది. వలస కార్మికులు ప్రత్యేకించి గల్ఫ్‌ కార్మికుల నిధులు తగ్గడం వల్ల వృద్ధి  పరిమితమైందని పేర్కొంది. అధిక శాతం మంది వలస కార్మికులు ప్రత్యేకించి అరబ్‌ దేశాల నుంచి వచ్చిన వారు కొవిడ్‌ 19 తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో తిరిగి వెళ్లడానికి తాము ఉద్యోగాలు చేస్తున్న దేశాల ప్రభుత్వాల అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు.

2021లో అల్ఫాదాయ, మధ్యాదాయ దేశాలకు నిధులు 7.3 శాతం వృద్ధితో 58,900 కోట్ల డాలర్లకు (రూ.44.18 లక్షల కోట్లు) చేరగలవని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. 2020లో  భారత్‌కు వచ్చిన విదేశీ నిధులు 8,300 కోట్ల డాలర్లు (రూ.6.23 లక్షల కోట్లు).

 

Tags :