మన ఊరు మన బడికి ఎన్ఆర్ఐ చేయూత

మన ఊరు మన బడికి ఎన్ఆర్ఐ చేయూత

మనఊరు మన బడి కార్యక్రమానికి చేయూత ఇచ్చేందుకు ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావడం ప్రశంసనీయమని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వరంగల్‌ జరిగిన కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐ రవిచంద్రన్‌ రెండు పాఠశాలలను దత్తత తీసుకున్నారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌, సత్యవతి రాథోడ్‌, జిల్లా ప్రజా ప్రతినిధులు, మనమూరు మనబడి ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటఱ్‌ మహేష్‌ బిగాల ఆధ్వర్యంలో రూ.20 లక్షల చెక్‌ను మంత్రి కేటీఆర్‌కు ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా రవచంద్రన్‌ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మహేష్‌ బిగాల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలు చేస్తున్న ఇంతటి మంచి కార్యక్రమానికి అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఆర్‌ఐల భాగస్వామ్యం ఉండేలా ప్రయత్నాలు చేస్తామని ఆయన వెల్లడించారు.

 

Tags :