పేద విద్యార్థులకు వెంకట్ సహాయం

పేద విద్యార్థులకు వెంకట్ సహాయం

డాలస్‌కు చెందిన ఎన్నారై జిల్లెళ్ళమూడి వెంకట్‌ గుంటూరు జిల్లా పుల్లడిగుంటలోని మలినేని ఇంజినీరింగ్‌ కళాశాలకు చెందిన 20మంది పేద విద్యార్థులకు లాప్‌టాప్‌లను అందజేశారు. వెంకట్‌ తల్లిదండ్రులు తిరుపతయ్య-గోవిందమ్మల చేతుల మీదుగా విద్యార్థినీ విద్యార్థులకు వీటిని అందజేశారు. పుల్లడిగుంట గ్రామ ప్రముఖులు ఉప్పుటూరి చిన్నరాములు-సీతామహాలక్ష్మిలు ముఖ్య అతిధులుగా విచ్చేశారు. మలినేని కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ మలినేని పెరుమాళ్ళు వెంకట్‌ తల్లిదండ్రులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ డి. శ్రీనివాసకుమార్‌, ప్రొఫెసర్‌ జె.కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. తానా ఫౌండేషన్‌ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

 

Tags :