బే ఏరియాలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్

బే ఏరియాలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులతో మీట్ అండ్ గ్రీట్

బే ఏరియాలో పర్యటనకు వచ్చిన ఆంధప్రదేశ్‍ ప్రభుత్వ సలహాదారులతో ఎన్నారైలు ఇటీవల సమావేశమయ్యారు. మీట్‍ అండ్‍ గ్రీట్‍ పేరుతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి కేవీ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. శాన్‍ఫ్రాన్సిస్కో కాన్సల్‍ జనరల్‍ నాగేంద్ర ప్రసాద్‍, ఎపి ఎన్‍ఆర్‍టీ చైర్మన్‍ వెంకట్‍ మేడపాటి, ఎపి ఐటీ పాలసీ, ఇన్వెస్ట్ మెంట్స్ సలహాదారు రాజ్‍ కేసిరెడ్డి, బే ఏరియా ఎన్నారైలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఐటీ సలహాదారు రాజ్‍ మాట్లాడుతూ ఆంధప్రదేశ్‍లో పెట్టుబడి పెట్టనున్న ఎన్నారైలకు ప్రభుత్వం తరపున లభించే ప్రోత్సాహకాలను వెల్లడించారు. ఐటీ,ఎలక్ట్రానిక్స్, పారిశ్రామిక మరియు ఇతర రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. సీఎం వైఎస్‍ జగన్‍ పిలుపుమేరకు ఆంధప్రదేశ్‍ అభివృద్ధిలో ఎన్‍ఆర్‍ఐలు భాగం కావాలని పిలుపునిచ్చారు. ఎపిఎన్‍ఆర్‍టీ కోఆర్డినేటర్లుగా నియమితులైన అబ్బవరం సురేంద్రారెడ్డి, కిరణ్‍ కూచిబొట్ల, సుబ్రహ్మణ్యంరెడ్డి రెడ్డివారి, నరసింహ యాదవ్‍ను, సహదేవ్‍ బోడెలను కేవీ రెడ్డి అభినందించారు. తెలుగు వారికి వారు మరిన్ని సేవలు అందిస్తారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్‍ఆర్‍సీపి సానుభూతిపరులు, అభిమానులు ఇతరులు పాల్గొన్నారు.

Click here for Photogallery

 

Tags :