బోస్టన్ లో టీడిపి మహానాడుకు భారీగా ఏర్పాట్లు

బోస్టన్ లో టీడిపి మహానాడుకు భారీగా ఏర్పాట్లు

అమెరికాలో తెలుగుదేశం పార్టీ మహానాడు పెద్దఎత్తున నిర్వహించేందుకు ఎన్నారై టీడిపి యుఎస్‌ఎ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నారై టీడిపి కన్వీనర్‌గా ఉన్న జయరాం కోమటి ఈ మహానాడును విజయవంతం చేసేందుకు అవసరమైన చర్యలను చేపట్టారు. మే 20,21 తేదీల్లో బోస్టన్‌ నగరంలో మహానాడును పెద్ద ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని ఇందులో టీడిపి నాయకులు, అమెరికాలో ఉన్న ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగుదేశం పార్టీ  అభిమానులు పాల్గొంటున్నారని ఆయన వివరించారు. బోస్టన్‌ మహానాడుతో ప్రారంభమయ్యే వేడుకలతోపాటు ఏడాది పొడవునా వివిధ నగరాల్లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలను ఎన్నారై టీడిపి తరపున నిర్వహిస్తామని తెలిపారు. 2023 మే 28వ తేదీన అమెరికాలో భారీ ఎత్తున మహానాడును నిర్వహిస్తామని తెలిపారు. ఏడాది పొడవునా అమెరికాలో జరిగే ఉత్సవాలలో పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి లోకేష్‌, ఇతర సీనియర్‌ నేతలు పాల్గొనే విధంగా కార్యక్రమాలు కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. మహిళలు కూడా శత జయంతి వేడుకల్లో చురుకుగా పాల్గొనే విధంగా మహిళా విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

బోస్టన్‌ మహానాడు లో కనుల పండుగగా, ఎప్పుడూ కని విని ఎరుగని రీతిలో తారక రాముని చిత్రపటాల ప్రదర్శన శాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మహానాడుకు పలువురు నాయకులు ముఖ్య అతిధులుగా హాజరవుతున్నారు. శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష, ఎంవిఎస్‌ఎన్‌ రాజు, మాగంటి మురళీ మోహన్‌, ప్రభాకర్‌ చౌదరి, మన్నవ సుబ్బారావు, నన్నూరి నర్సిరెడ్డి, కందుల నారాయణ రెడ్డి తదితరులు ఈ మహానాడులో పాల్గొంటున్నారు.

 

Tags :