ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్... ఆర్బీఐ కీలక నిర్ణయం

ఎన్ఆర్ఐలకు గుడ్ న్యూస్... ఆర్బీఐ కీలక నిర్ణయం

సీనియర్‌ సిటిజన్లకు భారీ ప్రయోజనం కలిగేలా ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని విద్యుత్‌, నీటి బిల్లులు, యుటిలిటీ బిల్లులను నేరుగా భారత్‌ బిల్లు చెల్లింపు వ్యవస్థ (బీబీపీఎస్‌ )ద్వారా చెల్లించడానికి ప్రవాస భారతీయులకు (ఎన్‌ఆర్‌ఐ)లకు అనుమతినిచ్చేందుకు ప్రతిపాదించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌, తాజా ద్వైమాసిక ద్రవ్య విధాన ప్రకటనలో ఈ మేరకు ప్రతిపాదించారు. క్రాస్‌ బోర్డర్‌ ఇన్‌వరల్డ్‌ పేమెంట్‌ల ఆమోదానికి వీలు కలగనుంది. తద్వారా దేశంలో నివసిస్తున్న వారికి మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవ ఇకపై ఎన్‌ఆర్‌ఐలకు లభించనుంది. దీంతో ఎన్‌ఆర్‌ఐలకు కూడా భారీ ఊరట కలగనుంది. దీనికి సంబంధించి విధి విధానాలను త్వరలో జారీ చేయనున్నామని గవర్నర్‌ తెలిపారు.

 

Tags :