ఆదినారాయణ కుటుంబానికి ఎన్నారైల సహాయం

ఆదినారాయణ కుటుంబానికి ఎన్నారైల సహాయం

తమ దాతృత్వానికి ఎల్లలు లేవని ఎన్నారైలు మరోసారి నిరూపించారు. గత డిసెంబర్ నెలలో కర్నూలు నగరం నుండి శబరిమల యాత్రకు బయలుదేరి గమ్యం చేరుకునేలోపు కేరళ రాష్ట్రంలోని శివకోయిల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన కర్నూలు నగరానికి చెందిన ఆదినారాయణ కుటుంబానికి ఎన్నారైలు రెండు లక్షల రూపాయల ఆర్ధిక సహాయం అందించారు. ఆదినారాయణ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించాల్సిందిగా కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ చైర్మన్ పొట్లూరి రవి కోరిన వెంటనే పలువురు ఎన్నారైలు ముందుకు వచ్చి సహాయం అందించారు. ఎన్నారైలు అందించిన సహాయాన్ని సోమవారం నాడు కర్నూలు సిటీ డీఎస్పీ కేవీ మహేష్ ద్వారా ఆదినారాయణ కూతురు రేఖకు అందించారు.

ఆదినారాయణ కుటుంబానికి అండగా ఉంటామని, కూతురు రేఖ చదువుకు సహకారం అందిస్తామని కర్నూలు ఎన్నారై ఫౌండేషన్ కోఆర్డినేటర్ ముప్పా రాజశేఖర్ తెలిపారు. సీఐ తబరేజ్ మాట్లాడుతూ సహాయం అందించిన ఎన్నారైల సేవానిరతిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సందడి మధు, జంపాల అమిత్, నంది మధు, మీనాక్షి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

 

Tags :