అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

అమెరికాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిందని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డ ధ్వజమెత్తారు. అమెరికాలోని కేన్సాస్‌ నగరంలో ఎన్టీఆర్‌ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపై ప్రవాసాంధ్రులు  స్పందించాలని కోరారు. ఏపీ అభివృద్ధిని గాలికొదిలిన జగన్‌రెడ్డి, సీబీఐ, ఈడీ కేసుల నుంచి కాపాడాలని ప్రధాని మోదీ కాళ్లు పట్టుకుంటున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత కాలం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు  ప్రవాసాంధ్రులు ముందుకురారని అన్నారు. రాష్ట్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు  ఉండవని పేర్కొనన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గుంటూరు మిర్చి యార్డు మాజీ చైర్మన్‌  మన్నవ సుబ్బారావు, టీడీపీ ఎన్నారై విభాగం కోఆర్డినేటర్‌ జయరాం కోమటి పాల్గొన్నారు.

 

Tags :
ii). Please add in the header part of the home page.