ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబి లో 'ఎన్టీఆర్ #31' ఫస్ట్ లుక్

ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబి లో  'ఎన్టీఆర్ #31' ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ #31వ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్డేట్‌ను ప్రకటించారు  ప్రశాంత్ నీల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఎన్టీఆర్ లుక్‌ను కాస్త రివీల్ చేసి చూపించారు. దీంతో ప్రశాంత్ నీల్ మార్క్ కనిపించింది.ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇప్పుడు నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ మరీ క్రూరంగా చూపించబోతోన్నట్టు కనిపిస్తోంది. ఎన్టీఆర్ రగ్గుడ్  లుక్కులో కనిపించనున్నట్టు తెలుస్తోంది. యంగ్ టైగర్ బర్త్ డే (మే 20) సందర్భంగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌ను చూసి ఫ్యాన్స్ సంబరపడిపోయారు. అయితే ఇంతలోనే అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చారు.

ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడతారట. ఈ విషయాన్ని మైత్రి అధికారికంగా ప్రకటించడంతో అభిమానులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమా షూటింగ్ వచ్చే ఏడాది స్టార్ట్ చేస్తే.. ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అంత వరకు అసలు ఏం చేస్తారు? అంటూ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.అయితే ఎన్టీఆర్ ఈలోపు కొరటాల శివ సినిమాను పూర్తి చేసేస్తాడు. మరో వైపు ప్రశాంత్ నీల్ సలార్ పనులన్నీ కంప్లీట్ చేస్తాడనిపిస్తోంది. ఇక ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి ఈ ప్రాజెక్ట్ మీద కూర్చుంటారనిపిస్తోంది. మొత్తానికి ఎన్టీఆర్‌తో మాత్రం పెద్ద లెవెల్‌లో ప్రశాంత్ నీల్ ప్లాన్స్ వేశాడనిపిస్తోంది. అసలే ఇది తనకు ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన ఐడియా అని, తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని డ్రీమ్ హీరోతో చేస్తుండటం హ్యాపీగా ఉందంటూ ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ 30, 31వ చిత్రాలకు సంబంధించిన అప్డేట్లు నందమూరి అభిమానుల్లో సంతోషాన్ని నింపేస్తున్నాయి. ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్‌గా వచ్చిన ఈ అప్డేట్‌లు నెట్టింట్లో ట్రెండ్ సృష్టిస్తుంది.   

 

 

Tags :