ఆస్ట్రేలియాలో ఘనంగా ఎన్టీఆర్ శత జయంతి వేడుకలు

దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగర వీధుల్లో టీడీపీ జెండాలతో సుమారు 2 గంటలకు పైగా సైకిల్ ర్యాలీ తీశారు. నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచం నలువైపులా చాటిన మహనీయుడు నందమూరి తారకరామారావు అని కొనియాడారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని ఆస్ట్రేలియా వాసులకు తెలియజెప్పడమే లక్ష్యంగా వేడుకలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 28న శక పురుషుడికి శత వసంతాలు పేరుతో కార్యక్రమం నిర్వహించనున్నాం. దీనికి బాలకృష్ణ దంపతులు, వారి చిన్న కుమార్తెను ఆహ్వానించాం అని తెలిపారు.
Tags :