ఎన్టీఆర్ ఫ్యామిలీ @ ప్యారిస్ : అల్లు అర్జున్ ఫ్యామిలీ @ దుబాయ్

ఎన్టీఆర్ ఫ్యామిలీ @ ప్యారిస్ : అల్లు అర్జున్ ఫ్యామిలీ @ దుబాయ్

యంగ్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్  అల్లు అర్జున్ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ తన ఫ్యామిలీతో పారిస్‌కు చెక్కేశాడు. ఇక బన్నీ అయితే అర్హ బర్త్ డే కోసం దుబాయ్‌లో గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్లో ఉన్నాడు. తన ఫ్యామిలీతో కలిసి ఎన్టీఆర్ పారిస్‌కు చెక్కేశాడు. తాజాగా ఎన్టీఆర్ తన కొడుకుతో దిగిన ఫోటోను షేర్ చేశాడు. ఇక మరో వైపు అల్లు అర్జున్ తన గారాల పట్టి అల్లు అర్హ పుట్టిన రోజును దుబాయ్‌లో గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేశాడు. ఈ మేరకు బుర్జ్ ఖలీఫాలో స్పెషల్ సెలెబ్రేషన్స్ ఏర్పాటు చేశాడు. అలా మొత్తానికి టాప్ హీరోలిద్దరూ కూడా ప్రస్తుతం విదేశాల్లోఉన్నారు. అక్కడే కుటుంబ సభ్యులతో గడిపేస్తున్నారు. అయితే తాజాగా వీరి ఫోటోలు మాత్రం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోన్నాయి. ఎన్టీఆర్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఎప్పుడో సారి మాత్రమే పోస్ట్ చేస్తాడు. ఏదైనా ప్రత్యేక సందర్భం ఉంటేనే స్పందిస్తుంటాడు. చంద్రబాబు ఏడ్చిన ఘటనపై ఎన్టీఆర్ ఓ వీడియోను వదిలాడు. అలా ఏదో ఒక స్పెషల్ కారణం ఉంటేనే సోషల్ మీడియాలో స్పందిస్తాడు.

తాజాగా తన కొడుకు అభయ్ రామ్‌ను ముద్దాడుతూ ఈఫిల్ టవర్‌ను కూడా తన పోస్ట్‌లో జోడించాడు. ఇక మరో వైపు అల్లు అర్జున్ మాత్రం తన కూతురి బర్త్ డే కోసం గ్రాండ్‌గా ప్లాన్ వేశాడు. బుర్జ్ ఖలీఫాలో అర్హ పుట్టిన రోజును సెలెబ్రేట్ చేశారు. తాజాగా అల్లు అర్హ బర్త్ డేకు సంబంధించిన ఫోటోలను అల్లు స్నేహారెడ్డి, బన్నీ షేర్ చేశారు. ఆ ఫోటోలన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నారు. నా చిన్న రాకుమారి అంటూ కూతురి మీద బన్నీ ప్రేమను కురిపించాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్నాడు. పుష్ప డబ్బింగ్ పనులతో అల్లు అర్జున్ బిజీగా ఉన్నాడు. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ కాగా.. ఇంకా పుష్ప సెట్స్ మీదే ఉంది. పుష్ప డిసెంబర్లో, ఆర్ఆర్ఆర్ సంక్రాంతి బరిలోకి దిగనుంది.

 

Tags :