ఆర్ ఆర్ ఆర్ నుంచి న్యూ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన ఎన్టీఆర్‌

ఆర్ ఆర్ ఆర్ నుంచి న్యూ పోస్ట‌ర్స్ విడుద‌ల చేసిన ఎన్టీఆర్‌

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . ఈ సినిమా నుంచి రీసెంట్‌గా కొమురం భీమ్ పోస్ట‌ర్‌ను ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌కధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఎంటైర్ ఇండియా ఆస‌క్తిగా సినిమా కోసం ఎదురుచూస్తోంది. పాన్ ఇండియా లెవ‌ల్లోనే కాదు.. పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్‌లో 10 భాష‌ల్లో వ‌చ్చే ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 7న సినిమా విడుద‌ల‌వుతుంది. ఈ సినిమా ట్రైల‌ర్‌ను డిసెంబ‌ర్ 9న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది కూడా. ఇందులో రామ్‌చ‌ర‌ణ్ మ‌న్యం వీరుడు అల్లూరి సీతా రామ‌రాజుగా న‌టిస్తుంటే.. తెలంగాణ గోండు వీరుడు కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. చ‌రిత్ర‌లో క‌లుసుకోని ఇద్దరు యోధులు క‌లుసుకుంటే ఎలా ఉంటుంద‌నే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌తో ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాను తె ర‌కెక్కించారు. ఈ సినిమా నుంచి రీసెంట్‌గా కొమురం భీమ్ పోస్ట‌ర్‌ను ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు.

ఆర్ ఆర్ ఆర్లో భీమ్ లుక్ మీకోసం అంటూ తార‌క్ విడుద‌ల చేసిన పోస్ట‌ర్‌లో రెండు తాళ్లు క‌నిపిస్తున్నాయి. వాటి చివ‌ర‌ల ఇనుప కొక్కెలు క‌నిపిస్తున్నాయి. వాటిని తార‌క్ క‌లిపే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ యాక్ష‌న్ పార్ట్‌ను రామ‌రాజు ఫ‌ర్ భీమ్ అనే టీజ‌ర్‌లోనూ మ‌నం వీక్షించ‌వ‌చ్చు. దాన్ని ఇప్పుడు స్పెష‌ల్ పోస్ట‌ర్‌గా విడుద‌ల చేశారు. ఆ పోస్ట‌ర్‌కు నంద‌మూరి, మెగాభిమానులతో పాటు ప్రేక్ష‌కుల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వ‌స్తుంది. మ‌రి ట్రైల‌ర్ విడుద‌ల లోపే రామ్‌చ‌ర‌ణ్‌కు సంబంధించిన మ‌రో పోస్ట‌ర్‌ను ఏమైనా విడుద‌ల చేస్తారేమో చూడాలి. ఇప్ప‌టి వ‌ర‌కు ఆర్ ఆర్ ఆర్ నుంచి విడుద‌లైన ప్రోమోలు, టీజ‌ర్స్‌, గ్లింప్స్‌, సాంగ్స్ అన్నింటి ప్రేక్ష‌కుల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక ట్రైల‌ర్ ఎలా ఉండ‌బోతుందోన‌ని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్‌ల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ అజ‌య్ దేవ‌గ‌ణ్‌, ఆలియా భ‌ట్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అలాగే రే స్టీవెన్ స‌న్‌, అలిస‌న్ డూడి, ఒలివియా మోరిస్ వంటి హాలీవుడ్ స్టార్స్ కూడా ఈ సినిమాలో న‌టిస్తున్నారు. బాహుబ‌లితో తెలుగు సినిమా రేంజ్‌ను ఇండియాకే కాదు.. ప్ర‌పంచానికి చాటిన డైరెక్ట‌ర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న సినిమా కావ‌డంతో భారీ అంచనాల‌తో సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. డి.వి.వి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నాలుగు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌తో సినిమాను నిర్మించారు.

 

Tags :