MKOne TeluguTimes-Youtube-Channel

మార్చ్ 23న NTR30 చిత్రానికి ముహూర్తం కుదిరింది : అధికారిక ప్రకటన వచ్చేసింది!  

మార్చ్ 23న NTR30 చిత్రానికి ముహూర్తం కుదిరింది : అధికారిక ప్రకటన వచ్చేసింది!  

RRR మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సినిమా కోసం ఆయన ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న NTR30 మూవీకి ముహూర్తం కుదిరింది. ఇటీవలే ఆస్కార్ వేడుకల నుంచి తిరిగొచ్చిన తారక్.. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమా లాంచింగ్ డేట్ పోస్టర్ రిలీజ్ చేశారు.  RRRతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఆయన.. అందుకు తగ్గట్టుగా కథలో మార్పులు కోరడంతో ప్రాజెక్ట్ కొంత ఆలస్యమైంది. అయితే ఆ తర్వాత RRR మూవీ ఆస్కార్ ప్రమోషన్స్, ఎన్టీఆర్ సోదరుడు తారకరత్న మరణంతో NTR30 లాంచింగ్ డేట్ పలుమార్లు వాయిదాపడుతూ వచ్చింది. ఇక ఆస్కార్ వేడుకల్లో పాల్గొన్న తర్వాత ఇటీవలే ఇండియా తిరిగొచ్చిన ఎన్టీఆర్.. శుక్రవారం రాత్రి విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యరు. ఈ మేరకు తన నెక్ట్స్ మూవీ త్వరలోనే స్టార్ట్ చేస్తానని ఫ్యాన్స్‌కు మాటిచ్చారు.

అన్నట్లుగానే ఈ రోజు (శనివారం) NTR30 మేకర్స్.. అఫిషియల్‌గా ముహూర్తం తేదీని  అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. విడుదలైన పోస్టర్ ప్రకారం.. NTR30 మార్చి 23న పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. అయితే ఈ విషయాన్ని వెల్లడిస్తూ విడుదల చేసిన పోస్టర్ అభిమానుల్లో విపరీతమైన క్యూరియాసిటీ కలిగించింది. కల్లోల సంద్రం నుంచి రక్తపు మరకలతో కూడిన ఓ కత్తి పైకి లేచినట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ఆ కత్తి వాలులో ఎర్రటి సూర్యూడు కనిపిస్తుండగా.. దానిపై NTR30 టైటిల్‌‌ ఎఫెక్టివ్‌గా కనిపిస్తోంది. కాగా.. ఈ పోస్టర్ చూసిన తారక్ ఫ్యాన్స్ క్రేజీగా ఫీలవుతున్నారు. సినిమా ముహూర్తానికి ముందే పోస్టర్స్ ఈ విధంగా ఉంటే.. షూటింగ్ జరిగే కొద్దీ వచ్చే అప్‌డేట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే, కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ సరసన బీటౌన్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోంది. తనకు తెలుగులో ఇదే మొదటి సినిమా కాగా.. తన అభిమాన నటుడు తారక్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం పట్ల చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇక యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి కోలీవుడ్ స్టార్ కంపోజర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్న విషయం తెలిసిందే.

https://twitter.com/YuvasudhArts/status/1637072481046654977

 

 

Tags :