ఎన్టీఆర్ తో పోటీ పడేదేవరు?

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 23కి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను పాన్ ఇండియన్ రేంజ్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ను ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో ఎవరు విలన్ అనే విషయంపై అందరికీ ఆసక్తి మొదలైంది.
ఏ సినిమాలోనైనా విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరోయిజం అంత హైలైట్ అవుతుంది. అందుకే స్టార్ హీరోల సినిమాల్లో విలన్‌లకు సూపర్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు విలన్ అంటే సెపరేట్ గా ఉండేవారు కానీ ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో స్టార్ హీరోలే విలన్లుగా నటిస్తున్నారు. ఈ ప్రయోగాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్30లో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం తెలియాల్సి ఉంది.
ఈ సినిమాలో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ పేరు డిస్కషన్స్‌లో ఉన్నా తను నటించే స్కోప్ లేదని తెలుస్తోంది. కానీ బాలీవుడ్ హీరోనే కొరటాల విలన్ గా తీసుకురావాలని చూస్తున్నారు. ఇప్పటికే సైఫ్ ప్రభాస్ తో ఆదిపురుష్ లో చేస్తున్నాడు. దీంతో తారక్ కోసం ఓ కొత్త విలన్ ను ఇంట్రడ్యూస్ చేయాలని చూస్తున్నారు.
ఈ సినిమా విషయంలో కొరటాల చాలా కేర్ తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఆర్ఆర్ఆర్ తో ప్రపంచమంతటా గుర్తింపు పొందిన తారక్, ఈ సినిమాతో ఎలాంటి హంగామా చేస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్30వ సినిమాలో చాలా సర్‌ప్రైజ్‌లు ఉంటాయని తెలుస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ హీరోయిన్ అని సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర బృందం. మరోపక్క ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న ఎన్టీఆర్ సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. మరి అందరి అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది చూడాలి.