ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరగాలి : ప్రభాకర్

తెలంగాణ ఎక్సైజ్ పాలసీపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ పాలసీకి పోలిక ఉందని తెలిపారు. ఎనిమిది సంవత్సరాల్లో రెండు సార్లు లిక్కర్ పాలసీ మార్చి, రెండు సార్లు రేట్లు పెంచారని ఆరోపించారు. ఢిల్లీలో లిక్కర్ సరఫరా చేసిన వారే తెలంగాణలో కూడా సరఫరా చేశారని పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్ పాలసీకి తెలంగాణ లిక్కర్ పాలసీ ఆదర్శమైనందని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్సీ కవిత మాట వినే వ్యక్తినే ఎక్సైజ్ శాఖకు మంత్రిని చేశారని విమర్శించారు. అలాగే చీఫ్ సెక్రటరీ మాటవినే వ్యక్తినే ఎక్సైజ్ కమిషనర్ బాధ్యతలు అప్పజెప్పారని వెల్లడిరచారు. దళిత బంధు, డబుల్ బెడ్రూం ఇళ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని ఆరోపించారు. లబ్దిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు ఇవ్వడంతో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు.