ఘనంగా న్యూయార్క్ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్ దసరా వేడుకలు

న్యూయార్క్ తెలంగాణ అమెరికన్ అసోసియేషన్, NYTTA, హప్పాగ్‌లోని రాడిసన్ హోటల్‌లో తన మొట్టమొదటి దసరా పండుగను జరుపుకుంది. ఈ వేడుకలకు తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్, టీటీఏ సహకారం అందించింది. ఈ కార్యక్రమం 500 మందికి పైగా అతిథులతో చాలా వైభవంగా జరిగింది.
గణేశుడికి పూజతో కార్యక్రమం ప్రారంభమైంది, అనంతరం గాయకులు ప్రార్థనా గీతం ఆలపించి కార్యక్రమానికి శుభారంభం అందించారు.
ఈ సందర్భంగా ఉదార పరోపకారి, దృఢమైన తెలంగాణవాది, US అంతటా మరియు ప్రపంచవ్యాప్తంగా అసోసియేషన్‌లకు మద్దతుదారుడు, డా. పైళ్ల మల్లా రెడ్డి మాట్లాడుతూ, NYTTA మొదటి అధ్యక్షురాలు శ్రీమతి రమా కుమారి వనమా మరియు ఆమె BODలు మరియు కార్యనిర్వాహక కమిటీ బృందాన్ని అభినందించారు. సంస్థ ప్రారంభం నుండి ప్రశంసనీయమైన కృషి చేస్తున్న కార్యావర్గాన్ని ప్రశంసించారు. సమాజ ప్రయోజనాల కోసం పని చేయడంలో అసోసియేషన్‌ల మధ్య సామరస్యాన్ని కోరుతున్నామని తెలిపారు.
అసోసియేషన్ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ గూడూరు మాట్లాడుతూ భారతదేశంలోని 29వ రాష్ట్రమైన తెలంగాణ కోసం NYTTA న్యూయార్క్‌లో ప్రత్యేక వేదికగా ఏర్పడి దాదాపు ఏడాది అవుతోంది. తెలంగాణ సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రచారం చేయడానికి, కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక తెలుగు సంఘం ఉండాలన్న న్యూయార్క్‌లోని తెలంగాణవాసుల చిరకాల వాంఛ NYTTA అన్నారు.
ఈ కోవిడ్ మహమ్మారి సమయంలో కష్టపడి పనిచేసినందుకు, అంకితభావంతో సమాజ సేవ చేసినందుకు అసోసియేషన్ వైస్-ఛైర్మెన్ లక్ష్మణ్ అనుగు కార్యావర్గాన్ని అభినందించారు మరియు రాబోయే అనేక సంవత్సరాలు మరింత విజయవంతమవాలని ఆకాంక్షించారు.
NYTTA ఏర్పడినప్పటి నుండి దానితో అనుబంధం కలిగి ఉన్న సలహాదారు చినబాబు రెడ్డి మాట్లాడుతూ, జట్టు యొక్క నిబద్ధత మరియు అంకితభావం కారణంగా అసోసియేషన్ గొప్ప ఎత్తులకు చేరుకుందని అన్నారు.
ప్రెసిడెంట్ రమ వనమా తన కార్యవర్గం నిరంతర శ్రమకి మరియు ఈ సంవత్సరం అంతా వారు అందించిన మద్దతుకు ధన్యవాదాలు తెలిపారు. NYTTA ప్రెసిడెంట్ పదవికి ఎంపిక కావడం గొప్ప భాగ్యం అని, ఇది సమాజానికి సేవ చేయడంలో తనకెంతో దోహదపడింది అన్నారు. ఆమె గత 20 సంవత్సరాలుగా సేవ చేస్తున్న తన అనుభవంతో సంస్థ యొక్క లక్ష్యాలను సాధించగలిగింది. గత సంవత్సరంలో నిర్వహించిన వివిధ కార్యక్రమాలను వివరించే వీడియొ ని ప్రదర్శించారు.
వైస్ ప్రెసిడెంట్, రవీందర్ కమతం మాట్లాడుతూ, NYTTAలో భాగం కావడం గొప్ప భాగ్యం అని, సంస్థ యొక్క లక్ష్యాలను సాధించడం కోసం నిరంతరంగా పని చేయడానికి ఎదురుచూస్తున్నానని, వచ్చే ఏడాది తన పదవీకాలంలో కార్యవర్గం నుండీ, కమ్యూనిటీ నుండి ఇలాంటి మద్దతును అభ్యర్థిస్తున్నానని అన్నారు.
స్థానిక చిన్నారులు డ్యాన్స్, పాటలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ మహిళా స్టాండప్ కమెడియన్ మధు టిక్ టాక్ క్వీన్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గాయని శ్రీకాంత్ లంక, దీప్తి నాగ్ తెలుగు సినిమా మెలోడీలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు మరియు తెలంగాణ జానపద పాటలని కూడా అందించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా సీనియర్ క్యాబినెట్ మంత్రి స్థాయి హోదాతో నియమించబడినందుకు US ఆధారిత ఆంకాలజిస్ట్ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత అయిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడుని NYTTA సత్కరించింది.
దక్షిణాసియా వ్యవహారాల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, దిలీప్ చౌహాన్ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని, తమ దాతృత్వ కార్యకలాపాల ద్వారా సమాజంపై ప్రభావం చూపిన వారికి బ్రూక్లిన్ బోరో ప్రెసిడెంట్ నుండి అనులేఖనాలను అందించారు. డా.రాము/డా.భారతి రెడ్డి, డా.శైలజ కల్వ/సతీష్ కల్వ, శరత్ వేముగంటి మరియు రమ వనమా ఈ గుర్తింపు పొందారు. దిలీప్ చౌహాన్ సమాజానికి గ్రహీతలు చేస్తున్న సేవను కొనియాడారు.
NYTTA సంస్థ కార్యకలాపాలకు ఆర్థిక సహాయం చేసిన ప్రధాన దాతలను సత్కరించింది.
ఈ సందర్భంగా తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ తెలంగాణ వాణి అనే పత్రికను ఆవిష్కరించింది. టీటీఏ వ్యవస్థాపకులు డా.పైళ్ల మల్లారెడ్డి పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జర్నల్ కమిటీ చైర్ సుధాకర్ ఉప్పల, టీటీఏ న్యూ యార్క్ చాప్టర్ రీజనల్ వైస్ ప్రెసిడెంట్ మల్లిక్ రెడ్డి, నేషనల్ ట్రెజరర్ పవన్ రవ్వ, ఎథిక్స్ కమిటీ చైర్ మాధవి సోలేటి, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సురేష్‌రెడ్డి వెంకన్న, మీడియా కమిటీ చైర్మన్ ఎల్.ఎన్. దొంతిరెడ్డి, కన్వెన్షన్ కమిటీ కన్వీనర్ శ్రీనివాస గనగోని, బీఓడీలు, రీజనల్ కోఆర్డినేటర్లు, వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అతిథులకు ఘనంగా పండుగ విందు అందించారు. ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ5/మనటీవీ ఛానెల్‌కు నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.