అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరోసారి కాల్పుల మోత

అమెరికాలో మరొక ఉన్మాది తుపాకీతో విరుచుకుపడ్డాడు. ఓహియో రాష్ట్రం బట్లర్‌ టౌన్‌షిప్‌లో ఒక దుండగుడు కాల్పులకు దిగగా, నలుగురు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తి కారులో పరారయ్యాడు. కారు వివరాల ఆధారంగా పోలీసులు అతడిని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. దుండగుడు కారు ఫొటోను పోలీసులు విడుదల చేసి ప్రజలను అప్రమత్తం చేశారు. నిందితుడిని స్టీఫెన్‌ మల్రోగా అనుమానిస్తున్నట్లు బట్లర్‌ టౌన్‌షిప్‌ పోలీస్‌ చీఫ్‌ జాన్‌ పోర్టర్‌ తెలిపారు.  ఎఫ్‌బీఐ, బ్యూరో ఆఫ్‌ ఆల్కహాల్‌, ఫైర్‌ ఆర్మ్స్‌ అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ తరపున గాలింపు చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించారు. నిందుతుడికి లెక్సింగ్టన్‌, కెంటకీ, ఇండియానాపోలిస్‌, చికాగోలతో సంబంధం ఉందని ఈ  పట్టణాల్లో ఎక్కడైనా ఉండవచ్చని ఎఫ్‌బీఐ పేర్కొంది.

 

Tags :