ఆర్తి అనాధాశ్రమానికి నాటా నుంచి లక్ష విరాళం

ఆర్తి అనాధాశ్రమానికి నాటా నుంచి లక్ష విరాళం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాటా) తమ సేవా దృక్పథంతో ఎన్నో మన్ననలు పొందుతోంది. తాజాగా ‘సేవా దినాలు’ నిర్వహించిన ఈ సంస్థ.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల పర్యటించి అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఈ క్రమంలోనే వైయస్సార్ జిల్లాలోని ఆర్తి అనాధాశ్రమానికి కూడా నాటా ప్రతినిధులు వెళ్లారు. అక్కడ నాటా సలహా మండలి చైర్మన్ డాక్టర్ ఆదివేష రెడ్డి చేతుల మీదుగా రూ.లక్ష విరాళం అందించారు. మహిళలకు, అనాధ పిల్లలకు ఆర్తి అండగా నిలుస్తుంది. వీళ్లందరికీ తమ వంతు సాయం చేయాలని అనుకున్న ఆదిశేష రెడ్డి ఈ విరాళం అందించారు. ఈ సమయంలో నాటా ఈవీపీ ఆళ్ల రామిరెడ్డి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వెంకట రామి రెడ్డి శనివారపు, సేవా దినాల కోఆర్డినేటర్ రాజీవ్ రెడ్డి పెనుబోలు, ఆళ్ల నవీన్ రెడ్డి, పార్ధసారధి రెడ్డి మండ, సోషల్ మీడియా కో-చైర్మన్ ముని శేఖర్ దువ్వూరు కూడా ఆదిశేష రెడ్డి వెంట ఉన్నారు.

 

 

Tags :