ఆస్కార్ నామినేషన్ ల ప్రకటన

ఆస్కార్ అవార్డుల నామినేషన్ లను 2023 జనవరి 24న ప్రకటించనున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ పాత్రికేయురాలు రోచెల్లీ రిలే వెల్లడించారు. ఆస్కార్ అవార్డులు ఇచ్చే అకాడమీ సభ్యులు ఆర్‌ఆర్‌ఆర్ చిత్రాన్ని చూస్తారని భావిస్తున్నానని ఆమె వెల్లడించారు. తారక్ కనబరిచిన అసాధారణ నటనను వారు గుర్తిస్తారని ఆశిస్తున్నానని తెలిపారు. తాను మరొక సారి ఈ చిత్రాన్ని చూస్తానని రోచెల్లీ రిలే తెలియజేశారు.
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్. ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఘన విజయం సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక ఫిలిం ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శితమైంది. అయితే, భారత్ నుంచి అధికారికంగా ఆస్కార్‌కు వెళ్లే అవకాశాన్ని కోల్పోయిన ఆర్‌ఆర్‌ఆర్ ఈ ప్రతిష్ఠాత్మక అవార్డుల రేసులో నిలిపేందుకు సొంతంగానే ప్రయత్నాలు చేస్తోంది. ఫర్ యువర్ కాన్పిడరేషన్ క్యాంపెయిన్ సాయంతో ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు చేరువ చేయాలని ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృంతం తీవ్రంగా కృషి చేస్తోంది.