లాస్ ఏంజెలెస్ లో ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం

సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో ఘనంగా జరిగింది. కన్నుల పండువగా జరిగిన ఈ వేడుకలో హాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ వేడుకల్లో మొత్తం 23 విభాగాల్లో అవార్డులు అందజేశారు. ఉత్తమ చిత్రంగా కోడా, ఉత్తమ నటుడిగా విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), ఉత్తమ నటిగా జెస్సికా చాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టామీ ఫే), ఉత్తమ దర్శకుడిగా జేన్ కాంపెయిన్ (ది పవర్ ఆఫ్ డాగ్) నిలిచి ఆస్కార్ అవార్డులు దక్కించుకున్నాయి. ఇక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో పోటీ పడిన భారతీయ చిత్రం రైటింగ్ విత్ ఫైర్‌కు నిరాశే ఎదురైంది. ఈ అవార్డును సమ్మర్ ఆఫ్ సోల్ కైవసం చేసుకుంది.
Tags :