ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన! భారత్ నుంచి 10 సినిమాలు రేసులో!!  నామినేషన్ పొందిన ‘నాటు నాటు’ పాట!!!

ఆస్కార్ నామినేషన్స్ ప్రకటన! భారత్ నుంచి 10 సినిమాలు రేసులో!!  నామినేషన్ పొందిన ‘నాటు నాటు’ పాట!!!

అస్కార్ అవార్డ్ నామినేషన్స్ రేసులో భారత్‌కి చెందిన పది సినిమాలు నిలిచాయి. వివిధ ప్రాంతాలకి చెందిన ఈ మూవీలు వివిధ కేటగిరీలో పోటీలో నిలిచాయి. అయితే ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డుని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ...? దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి  దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’  సినిమా ప్రతిష్ఠాత్మక ఆస్కార్  అవార్డు రేసులో నిలిచింది. 95వ అస్కార్ అవార్డు నామినేషన్స్‌లో నిలిచిన సినిమాల జాబితాని మంగళవారం ప్రకటించారు. ఈ జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా నుంచి ‘నాటు నాటు’ పాట ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌గా నామినేట్ అయ్యింది.

ఇటీవల కాలిఫోర్నియా వేదికగా జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఆర్ఆర్ఆర్ మూవీలోని ‘నాటు నాటు’ పాటకి ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీ’లో అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఒక్కటే కాదు.. రెండు రోజుల క్రితం జపాన్ 46వ అకాడమీ అవార్డ్స్‌లో ‘అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌’కేటగిరిలోనూ అవార్డుని ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. అవతార్ -2, టాప్‌గన్‌: మావెరిక్ లాంటి భారీ చిత్రాల్ని వెనక్కి నెట్టి మరీ ఆర్ఆర్ఆర్ మూవీ అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరీలో అవార్డుని దక్కించుకోవడం విశేషం. ఆస్కార్‌ నామినేషన్‌ రేసులో భారత్‌కి చెందిన మొత్తం 10 సినిమాలు నిలిచాయి. రిషబ్ శెట్టి నటించిన కాంతార సినిమా ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు కేటగిరీల్లో ఆస్కార్‌ నామినేషన్ రేసులో నిలిచినా నిరాశే ఎదురైంది. ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం మార్చి 12న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. ఆస్కార్ నామినేషన్స్ రేసులో నిలిచిన భారత సినిమాలు ఆర్‌ఆర్‌ఆర్‌, కాంతార, రాకెట్రీ, ఛల్లో షో, గంగూభాయి కతియావాడి, విక్రాంత్‌ రోణ, ది నంబీ ఎఫెక్ట్‌, మి వసంతరావ్‌,తుజ్యా సాథీ కహీ హై, ఇరవిన్‌ నిళల్‌.

OSCARS TWITTER LINK:
https://twitter.com/TheAcademy/status/1617880619006185472

 

 

Tags :