చికాగో ఓయూ పూర్వ విద్యార్థుల సమావేశం..హాజరైన ఓయూ వీసీ

చికాగో ఓయూ పూర్వ విద్యార్థుల సమావేశం..హాజరైన ఓయూ వీసీ

ఉన్నత విద్య, పరిశోధనల్లో విదేశీ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్సిటీ గమ్యస్థానంగా మారిందని ఓయూ వైఎస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ డా.రవీందర్‌ అన్నారు.  అమెరికాలో పర్యటనలో భాగంగా చికాగో నగరంలో ఓయూ పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ`అమెరికన్లు పిల్లలను నాణ్యమైన ఉన్నత విద్య కోసం ఉస్మానియా యూనివర్సిటీకి పంపించాలని సూచించారు. ప్రపంచపోకడలకు అనుగుణంగా ఆధునిక సాంకేతికతతో కూడిన ఆర్టిపిషియన్‌ ఇంటిలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బిగ్‌ డేటా అనలిటిక్స లాంటి కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామని పేర్నొన్నారు.

రోబోటిక్స్‌, బ్లాక్‌ చైన్‌, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, డ్రోన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ లాంటి కోర్సులను భవిష్యత్‌ అవసరాల కోసం ప్రవేశపెట్టామన్నారు. అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాల ఫలితంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌ దేశాల్లో ఓయూ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు.

 

Tags :