ఓయూకు మరో అరుదైన గుర్తింపు.. దేశంలోనే

ఓయూకు మరో అరుదైన  గుర్తింపు.. దేశంలోనే

విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లను అధిగమించిన ఉస్మానియా యూనివర్సిటీకి తాజాగా మరో గుర్తింపు పొందింది. 2022 సంవత్సరానికి దేశంలో బెస్ట్‌ ఎడ్యుకేషన్‌ బ్రాండ్‌ అవార్డును సాధించింది. దేశంలోని ప్రముఖ ఐఐటీలు, కేంద్రియ విశ్వవిద్యాలయాలను అధ్యయనం చేసిన ది ఎకానమిక్‌ టైమ్స్‌ ఈ అవార్డును ప్రకటించింది. నేషనల్‌ బోర్డు ఆఫ్‌ అక్రెడిటేషన్‌ (ఎన్‌బీఏ) చైర్మన్‌ కేకే అగర్వాల్‌, ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఆఫ్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) చైర్మన్‌ డాక్టర్‌ అనిల్‌ సహస్రబుద్ధి సమక్షంలో అసోం విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ రనోజ్‌ పెగు చేతుల మీదుగా ఈ అవార్డును ఢల్లీిలో ఓయూ యూజీసీ డీన్‌ ప్రొఫెసర్‌ జీ మల్లేశం అందుకున్నారు. ఓయూకు అవార్డు రావడం పట్ల వీసీ ప్రొఫెసర్‌ రవీందర్‌, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ లక్ష్మీ నారాయణ హర్షం వ్యక్తం చేశారు.

 

Tags :