ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు సరికొత్త రికార్డు

ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు సరికొత్త రికార్డు

ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు దేశంలోని ప్రతి రాష్ట్రాన్ని చుట్టి సరికొత్త రికార్డు సృష్టించారు. ఐదేళ్ల పదవీకాలంలో ఆయన ప్రతి రాష్ట్రాన్ని, కేంద్రపాలిత ప్రాంతాన్ని చుట్టివచ్చారు. వెయ్యికిపైగా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. విద్యాసంస్థలు, పరిశోధన సంస్థలను సందర్శించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులను ప్రారంభించారు. విభిన్న అంశాలపై పనిచేసే ప్రజలు, నిపుణులతో మమేకమయ్యారు. బీజేపీ అధ్యక్షుడిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన సమయంలో దేశమంతటా విస్తృతంగా పర్యటించిన అనుభవం ఉన్న ఆయన ఉపరాష్ట్రపతి హోదాలోనూ అదే ఒరవడి కొనసాగించారు. భారత్‌ మళ్లి విశ్వగురు స్థానాన్ని అధిష్టించాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. విద్యావంతులు, నిపుణులు, విద్యార్థులు, రైతులు పౌరసమాజ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు ఉపరాష్ట్రపతి నివాస భవనంలో ఒక సమవేశ మందిరాన్ని నిర్మింపజేశారు. తన పనితీరును ప్రజల ముందుంచేందుకు మూవింగ్‌ ఆన్‌ మూవింగ్‌ పార్వర్డ్‌ పేరుతో ఏటా కాపీ టేబుల్‌ బుక్‌ను తీసుకొచ్చారు.

 

Tags :