శరణార్థులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త

శరణార్థులకు అమెరికా ప్రభుత్వం శుభవార్త

అఫ్గానిస్తాన్‍ను వదిలి అమెరికాలో కాలుపెట్టిన అఫ్గాన్‍ శరణార్థులకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‍ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 50 వేల మంది అఫ్గానిస్థాన్‍ పౌరులు అమెరికాకు వచ్చినట్టు హోంల్యాండ్‍ సెక్యూరిటీ సెక్రెటరీ అల్జెండ్రో మార్కోస్‍ తెలిపారు. వారిని అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఒక్కొక్కరికి 2,275 డాలర్లు (రూ.1.60) సాయం చేస్తామన్నారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు వీటిని అందించనున్నామని ప్రకటించారు. ఫెడరల్‍ ప్రభుత్వం ఆదుకుంటుందని స్పష్టం చేశారు. శరణార్థులకు ఆహారంతో పాటు వారి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సహాయం చేస్తుందన్నారు. అమెరికాలో స్థిర నివాసం ఏర్పర్చుకునేందుకు వీటిని అందించనున్నామని ప్రకటించారు. ఫెడరల్‍ ప్రభుత్వం అదుకుంటుందని స్పష్టం చేశారు.

శరణార్థులకు ఆహారంతో పాటు వారి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు సహాయం చేస్తుందన్నారు. మరికొన్ని నెలల్లో అఫ్గాన్‍ పౌరులు అమెరికాలో జీవనం ప్రారంభిస్తారని చెప్పుకొచ్చారు. మెడికాయిట్‍ వంటి ఫెడరల్‍ ప్రయోజనాలు కల్పించేందుకు కూడా సాధ్యాసాధ్యాలపై కాంగ్రెస్‍ డిపార్ట్మెంట్‍తో చర్చిస్తోందని తెలిపారు. చట్టబద్దమైన శాశ్వత నివాసం, వీసా హోల్డర్లు ప్రత్యేక వలస వీసాల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు, జర్నలిస్టులు, సహాయక కార్మికులు లాంటి ఎంతో మంది తాలిబన్ల అరాచక పాలన నుంచి తప్పించుకుని అమెరికా వచ్చారని వివరించారు. అఫ్గాన్‍ శరణార్థులకు వసతులు కల్పించాల్సిన బాధ్యతలను మాజీ డెలావేర్‍ గవర్నర్‍ జాక్‍ మార్కెల్‍కు అప్పగించారు. మిత్రులకు స్వాగతం అనే ఆపరేషన్‍ ద్వారా ఆదుకుంటున్నారు.

 

Tags :