విదేశాల్లో అతిథి మర్యాదలు.. అనుమతులు ఆన్‌లైన్‌ లో

విదేశాల్లో అతిథి మర్యాదలు.. అనుమతులు ఆన్‌లైన్‌ లో

రాజకీయ నాయకులు, న్యాయమూర్తులు, శాసనకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు విదేశాల్లో పర్యటిస్తున్న సమయంలో అక్కడ అతిథి మర్యాదలు స్వీకరించాలంటే దానికి కావాల్సిన అనుమతుల ప్రక్రియను ఇకపై ఆన్‌లైన్‌ విధానంలో పూర్తి చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్‌ఏ)లో ఈ మేరకు నిబంధనను చేర్చినట్లు విడుదలైన ఉత్తర్వులు పేర్కొన్నాయి. విదేశీ పర్యటనకు పరిపాలనపరమైన అనుమతిని సంబంధిత వ్యక్తులు విడిగా పొందాలనీ, తాజా నిబంధనతో దానికి సంబంధం లేదని హోంశాఖ స్పష్టం చేసింది. 

 

Tags :
ii). Please add in the header part of the home page.