అయోధ్య నుంచి ఎంఐఎం ప్రచారం

అయోధ్య నుంచి ఎంఐఎం ప్రచారం

ఉత్తరప్రదేశ్‍లో వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల కోసం ఎంఐఎం ప్రచారం నిర్వహించనుంది. ఉత్తర ప్రదేశ్‍ జరగనున్న ఎన్నికల్లో ఎంఐఎం భారీ స్థానాలకు పోటీ చేయనుంది. చారిత్రక నగరమైన అయోధ్య నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించన్నుట్లు యూపి ఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు షాకత్‍ అలీ పేర్కొన్నారు. అందులో భాగంగానే అయోధ్య నగరానికి 57 కిలోమీటర్ల దూరంలో ఉన్న రుదౌలి తహసీలో ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దిన్‍ ప్రారంభించారన్నారు. ఈ సమావేశంలో ముస్లింలనే కాకుండా దళితులు,  హిందువులు కూడా హాజరు అయ్యారని షాకత్‍ అలీ తెలిపారు. అయితే యూపీలో వచ్చే ఏడాది ఎన్నికల కోసం ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.

 

Tags :