అమెరికాలో ఓజోన్‌టెల్‌ విస్తరణ...వచ్చే ఏడాది నుంచి

అమెరికాలో  ఓజోన్‌టెల్‌ విస్తరణ...వచ్చే ఏడాది నుంచి

హైదరాబాద్‌కు చెందిన క్లౌడ్‌ కమ్యూనికేషన్‌ సేవల సంస్థ ఓజోన్‌టెల్‌ రూ.37.44 కోట్ల నిధులను సమీకరించింది. బెంగళూరు కేంద్రంగా ఉన్న ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ స్టేక్‌ బోట్‌ క్యాపిటల్‌ నుంచి ఏ సిరీస్‌ ఫండింగ్‌లో భాగంగా  5 మిలియన్‌ డాలర్లు (రూ.37.44) సేకరించినట్లు ఒక ప్రకనటలో వెల్లడిరచింది. వచ్చే ఏడాది అమెరికాలో కంపెనీ కార్యకలాపాలను విస్తరించడం కోసం ఈ నిధులను వెచ్చించనున్నట్లు ఓజోన్‌టెల్‌ వ్యవస్థాపకులు సీఎస్‌ఎన్‌ మూర్తి వెల్లడిరచారు.  తద్వారా ఇప్పటి వరకు కంపెనీకి ఉన్న క్లయింట్ల సంఖ్యను రెట్టింపు చేసుకునే అవకాశం ఉన్నదన్నారు. మా సంస్థ వ్యాపార కార్యకలాపాలను మరింతగా విస్తరించడానికి మంచి తరుణంగా భావిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

 

Tags :