ప్రేమకథ కాదు.. ప్రేమ గురించి చెప్పే 'పాగల్'

ప్రేమకథ కాదు.. ప్రేమ గురించి చెప్పే 'పాగల్'

విష్వక్‍సేన్‍ హీరోగా రూపొందుతున్న చిత్రం పాగల్‍. నివేదా పేతురాజ్‍ హీరోయిన్‍. దిల్‍రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్‍ నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 14న విడుదలవుతుంది. ఈ సినిమా ట్రైలర్‍ను ఫలక్‍నుమాదాస్‍ నిర్మాత రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా హీరో విష్వక్‍ సేన్‍ మాట్లాడుతూ గత ఏడాది హిట్‍ సినిమా తర్వాత ప్రేక్షకులను కలుసుకునే అవకాశం రాలేదు. ఇప్పుడు పాగల్‍ సినిమాతో మీ మందుకొస్తున్నాను. నేను, బెక్కెం వేణుగోపాల్‍గారు నమ్మి ఈ సినిమాపై రెండు రూపాయలు రిస్క్ చేద్దామంటే, మాకంటే  ఈ సినిమా ఎక్కువగా నమ్మిన దిల్‍ రాజుగారు నాలుగు రూపాయల రిస్క్ చేశారు. అందరం ప్రేమించి సినిమా చేశాం. పాగల్‍  ప్రేమకథ మాత్రమే కాదు.. ప్రేమ గురించి చెప్పే కథ. ఇందులో భూమికగారు నా అమ్మ పాత్రను చేశారు అన్నారు. లక్కీ మీడియా బ్యానర్‍ అధినేత, చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్‍ మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు బెంగుళూరు, చెన్నై, యు.ఎస్‍లలో సినిమాను విడుదల చేస్తున్నాం. ఎగ్జిబిటర్స్, డిస్టిబ్య్రూటర్స్ ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు అన్ని సెంటర్స్ లో సినిమా విడుదల చేస్తున్నాం. దిల్‍రాజు గారు ఇచ్ని ధైర్యంతో రిస్క్ అయినా సినిమాను థియేటర్స్లో రిలీజ్‍ చేస్తున్నాం అన్నారు.

ఫలక్‍నుమాదాస్‍ నిర్మాత రాజు మాట్లాడుతూ ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా చేశారు. పాగల్‍ అనేది మదర్‍ సెంటిమెంట్‍తో వస్తున్న సినిమా అన్నారు. నివేదా పేతురాజ్‍ మాట్లాడుతూ ఈ సినిమాను పాగల్‍ లా చేశారు. కచ్చితంగా  ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ సిమ్రాన్‍ చౌదరి, మేఘ లేఖ, జబర్‍దస్త్ రామ్‍ ప్రసాద్‍ తదితరులు పాల్గొన్నారు.

Tags :