బే ఏరియాలో పాఠశాల పుస్తకాల పంపిణీ

బే ఏరియాలో పాఠశాల పుస్తకాల పంపిణీ

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో పాఠశాల కొత్త సంవత్సర విద్యాబోధనలో భాగంగా బే ఏరియాలోని చిన్నారులకు తెలుగు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. బాటా, తానా నాయకులు ఈ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం విజయవంతానికి సహకరించారు. బాటా అడ్వయిజర్లు వీరు ఉప్పల, డా. రమేష్‌ కొండ, తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి, తానా రీజినల్‌ రిప్రజెంటేటివ్‌ రామ్‌తోట, పాఠశాల చైర్‌ నాగరాజు నలజులతోపాటు బాటా కమిటీ నాయకులు అరుణ్‌ రెడ్డి, సురేష్‌ శివపురం, శరత్‌ పోలవరపు, పాఠశాల బే ఏరియా టీమ్‌కు చెందిన రామదాసు పులి, శ్రీదేవి ఎర్నేని, రవి పోచిరాజు, పాఠశాల ఇండియా టీమ్‌ ప్రణతి పోచిరాజు, సురేంద్ర తదితరులు ఈ కార్యక్రమానికి సహకరించారు. పుస్తకాలు తీసుకోలేని వారు వీరిని సంప్రదించి తీసుకోవచ్చని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.

ఫ్రీమాంట్‌ ప్రాంతానికి చెందినవారు రామదాసు పులి (510) 402 3175, శాన్‌రామన్‌ - డబ్లిన్‌ ప్రాంతానికి చెందినవారు శరత్‌ పోలవరపు(650) 440-2781, రవి పోచిరాజు(408) 813 2347, సన్నివేల్‌ కుపర్టినో, శాన్‌హోసె ప్రాంతానికి చెందినవారు ప్రసాద్‌ మంగిన(408) 499 6530, సురేష్‌ శివపురం(408) 896 7136 ను సంప్రదించి పుస్తకాలను తీసుకోవచ్చు. 
 

Click here for Photogallery

 

Tags :
ii). Please add in the header part of the home page.