బే ఏరియాలో ప్రారంభమైన పాఠశాల తరగతులు

బే ఏరియాలో ప్రారంభమైన పాఠశాల తరగతులు

బే ఏరియాలో కూడా పాఠశాల విద్యాసంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించారు. పాఠశాల కో చైర్‌ ప్రసాద్‌ మంగిన మాట్లాడుతూ, మన చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడంతోపాటు, వారిచేత ప్రదర్శనలను ఇప్పించేందుకు పాఠశాల కృషి చేస్తోందని చెప్పారు. తానా, బాటా ఇస్తున్న మద్దతుతో పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఎన్నారై పిల్లలకు అనువైన కరికులంను పాఠశాల ప్రత్యేకంగా తయారు చేసిందని దీని ద్వారా సులభంగా చిన్నారులు తెలుగు భాషను నేర్చుకోవచ్చని చెప్పారు.

తానా అధ్యక్షుడు అంజయ్య చౌదరి మాట్లాడుతూ, పాఠశాలకు వస్తున్న స్పందన మాకు ఎంతో సంతోషాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తోందని చెప్పారు. నేటితరంతోపాటు వచ్చేతరం కూడా తెలుగుభాషను నేర్చుకోవాలన్న ఉద్దేశ్యంతో తెలుగుభాష పరిరక్షణకు తానా కృషి చేస్తోందని చెప్పారు.

తానా మాజీ అధ్యక్షులు జయరామ్‌ కోమటి సహకారంతో పాఠశాలను తానా చేపట్టిందని, ఇప్పుడు అన్నీచోట్లా పాఠశాల కేంద్రాలు ఏర్పడటం సంతోషంగా ఉందని తానా మాజీ అధ్యక్షులు జయ్‌ తాళ్ళూరి అన్నారు.

బాటా సలహాదారు విజయ ఆసూరి మాట్లాడుతూ, బాటా పాఠశాల తరగతుల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తోందని చెప్పారు. ఇక ముందు కూడా పాఠశాల నిర్వహణకు బాటా చేయూతనిస్తుందని తెలిపారు.

పాఠశాల చైర్‌ నాగరాజు నలజుల మాట్లాడుతూ, పాఠశాలకు అన్నీ చోట్ల మంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీచర్లు, కో ఆర్డినేటర్ల మద్దతుతో పాఠశాల దిగ్విజయంగా అన్నీ చోట్లా తరగతులను విజయవంతంగా ప్రారంభిస్తోందన్నారు.

బాటా ప్రెసిడెంట్‌ హరినాథ్‌ చికోటి, అకడమిక్‌ డైరెక్టర్‌ డా. రమేష్‌ కొండ, బాటా అడ్వయిజర్‌ వీరు ఉప్పల కొత్తగా చేరిన పాఠశాల విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.

తానా రీజినల్‌ కో ఆర్డినేటర్‌ రామ్‌ తోట, తానా కార్యదర్శి సతీష్‌ వేమూరి తొలుత అందరికీ స్వాగతం పలికారు. కరికులం డైరెక్టర్‌ గీతామాధవి, టీచర్లు శ్రీదేవి ఎర్నేని, రవిపోచిరాజు, శరత్‌ పోలవరపు, గీతా విశ్వనాథ్‌, శ్రీదేవి పసుపులేటి, రామదాసు, పద్మ విశ్వనాథ, సునీత రాయపనేని, దీపిక అజయ్‌, షీలా గోగినేని, సత్య బుర్ర, అర్చన చాదా, మమత శ్యామ్‌ చాదా, పద్మ శొంటి, సురేష్‌ శివపురం, ధనలక్ష్మీ, మూర్తి వెంపటి, శ్రీకాంత్‌ దాశరథి, శ్రీధర్‌, శ్రీదివ్య యలమంచి, రాగిణి తదితరులు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

Click here for Photo Gallery

 

Tags :