హైదరాబాద్ లో ప్యాక్టెరా ఎడ్జ్ విస్తరణ...2023 నాటికి

హైదరాబాద్ లో ప్యాక్టెరా ఎడ్జ్ విస్తరణ...2023 నాటికి

అమెరికాకు చెందిన డిజిటల్‌, టెక్నాలజీ సేవల సంస్థ ప్యాక్టెరా ఎడ్జ్‌ హైదరాబాద్‌లో మరో క్యాంపస్‌ను ఆరంభించింది. కంపెనీ సీఈవో వెంకట్‌ రంగాపురం ఈ సెంటర్‌ను లాంచణంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అమెరికా కేంద్రంగా ఉన్న ఈ సంస్థకు ఇప్పటికే దేశంలో 1,500 ఉద్యోగులున్నారు. ఈ ఏడాది చివరి నాటికి వీరి సంఖ్య 2,000 చేరుకుంటుందని తెలిపారు. రాబోయే 18 నెలల్లో హైదరాబాద్‌ కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య 3,000కు చేరుకుంటుందని తెలిపారు. 2025 నాటికి దేశ వ్యాప్తంగా 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

వరంగల్‌లోనూ కార్యాలయాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఉన్నట్లు తెలిపారు. క్లౌడ్‌ డిజిటల్‌ టెక్నాలజీల కోసం ప్రాంగణ ఎంపికలతో పాటు అనుభవజ్ఞులనూ నియమించుకుంటామన్నారు. అంతర్జాతీయంగా ఉన్న నిపుణుల్లో 40 శాతం మంది భారత్‌ నుంచే సేవలను అందిస్తున్నారన్నారు. సంస్థ సీఎస్‌ఓ దినేశ్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఐఐఐటీ హైదరాబాద్‌తో కలిసి ఏఐ ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌ నిర్వహిస్తున్నట్లు, ఎంపికైన 3 అంకురాలకు అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో పనిచేసే అవకాశాలను కల్పించబోతున్నట్లు తెలిపారు. వీటికి రూ.12 లక్షల వరకు ఈక్విటీ గ్రాంటు సమకూరుస్తున్నట్లు వెల్లడిరచారు.

 

Tags :