‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలిన గోపీచంద్

‘మీతో సెల్యూట్ కొట్టించుకోడానికి నేను హీరో కాదురా.. విలన్’ అంటూ పవర్ ఫుల్ డైలాగ్ వదిలిన గోపీచంద్

గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్  అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం నుంచి ట్రైలర్‌ను మేకర్లు విడుదల చేశారు.పక్కా కమర్షియల్ ట్రైలర్  నిన్న రాత్రి ఓ థియేటర్ లో  విడుదలైంది. గోపీచంద్  కొత్త యాంగిల్‌ను చూపించాడు దర్శకుడు మారుతి. రాశీ ఖన్నా కూడా మరోసారి తన కామెడీ టైమింగ్‌తో మెప్పించేందుకు రెడీ అయినట్టుంది. ఇక ఈ ట్రైలర్‌లో రావు రమేష్ మాత్రం కొత్తగా కనిపించేశాడు. వేష, యాస అన్నీ కూడా డిఫరెంట్‌గా కనిపించాయి. మొత్తానికి ట్రైలర్ మాత్రం నిజంగానే పక్కా కమర్షియల్ సినిమా అన్నట్టుగానే ఉంది.వాడు ఎంత పెద్ద క్రిమినల్ అయినా సరే.. కేస్ టేకప్ చేస్తే బోనులో తడిగుడ్డేసుకుని కూర్చోవచ్చు అంటూ హీరో కారెక్టరైజేషన్ గురించి చెబుతూ ట్రైలర్ మొదలవుతుంది. ఆ తరువాత లాయర్‌గా గోపీచంద్ పాత్ర ఎంట్రీ ఇస్తుంది. అందరూ సెల్యూట్ కొడుతుంటే.. అందరూ సెల్యూట్ కొట్టడానికి నేను హీరోని కాదు.. విలన్ అంటూ గోపీచంద్ చేసిన యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయింది.

కోర్టు రూంలో అర్థమైందా? అర్థమైందా? అంటూ గోపీచంద్ చెప్పే డైలాగ్స్ ఫన్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. ఇక రాశీ ఖన్నా కారెక్టర్ మరింత కొత్తగా ఉండేట్టు కనిపిస్తోంది. సినిమాలో సినిమా హీరోయిన్‌గా నటించినట్టుంది. లాయర్ పాత్ర కోసం లా చదివి మరి కారెక్టర్ చేసినట్టుగా చూపించాడు. గోపీచంద్ రాశీ ఖన్నా కెమిస్ట్రీ బాగానే వర్కవుట్ అయ్యేట్టు కనిపిస్తోంది. మొత్తానికి ఇది తండ్రీ కొడుకుల మధ్య పోరులా కనిపిస్తోంది. న్యాయాన్ని కాపాడేందుకు కొడుకుతో పోరాడే పాత్రలో సత్యరాజ్ కనిపించబోతోన్నాడు. ఇక ఇందులో రాశీ ఖన్నా రోల్ మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయ్యేలా కనిపిస్తోంది. కామెడీని రాశీ ఖన్నా బాగానే హ్యాండిల్ చేసినట్టుంది.

 

Tags :
ii). Please add in the header part of the home page.