ప్రభుత్వం కొత్త నిబంధనలు.. రూ.20 లక్షలు దాటితే

ప్రభుత్వం కొత్త నిబంధనలు.. రూ.20 లక్షలు దాటితే

బ్యాంకులో నగదు లావాదేవీలకు సంబంధించి ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు లేదా పోస్టాఫీసులో రూ.20 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్‌ లేదా ఉపసంహరణ చేయడానికి పాన్‌, ఆధార్‌ నంబర్‌ తప్పనిసరిగా ఉండాలి. సిబిడిటి (కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు) ఆదాయపు పన్ను (15వ సవరణ) రూల్స్‌, 2022 ప్రకారం కొత్త నిబంధనలను ఖరారు చేశారు. ఈ నోటిఫికేషన్‌ 2022 మే 10న జారీ చేశారు. ఈ కొత్త నిబంధనలు 2022 మే 26 నుంచి అమల్లోకి వస్తాయి.

 

 

Tags :