తాతను చేస్తారా? ఐదుకోట్లిస్తారా?

తాతను చేస్తారా? ఐదుకోట్లిస్తారా?

ఏడాదిలో తనకు మనవడో మనవరాలినో అందించాలి లేదా 5 కోట్ల రూపాయల పరిహారం అయినా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఓ వ్యక్తి తన కొడుకు కోడలుపై కేసు దాఖలు చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఎస్‌ఆర్‌ ప్రసాద్‌ అనే ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ఈ కేసు పెట్టి మీడియాకు తెలిపారు. కొడుకు పెద్ద చదువులు చదవించాను. శిక్షణకు అమెరికాకు పంపించాను. ఉన్న డబ్బంతా పోయింది. 2016లో కొడుకు పెళ్లయింది. అయితే ఇంతవరకూ వారికి సంతానం కలుగలేదన్నారు. ఆడబిడ్డనా మగబిడ్డనా అనేది తమకు పట్టింపు లేదని తాము తమ కొడుకుకు వారసులను కోరుతున్నామని ఆ దంపతులు తెలిపారు. బిడ్డలు కావాలి, లేదా కొడుకు ఓ రెండున్నర కోట్ల కోడలు ఓరెండున్న కోట్లు తమకు ఇవ్వాల్సి ఉంటుందని తమ లాయర్‌ ఎకే శ్రీవాస్తవ ద్వారా ఈ నోటీసును వారికి పంపించారు.

 

Tags :