MKOne Telugu Times Business Excellence Awards

అమ్మానాన్నలకు సత్కారం

అమ్మానాన్నలకు సత్కారం

న్యూజెర్సిలో నాట్స్‌ ఆధ్వర్యంలో మే 26 నుంచి 28 వరకు అంగరంగ వైభవంగా జరిగే  అమెరికా తెలుగు సంబరాల్లో వివిధ రకాల కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు వైభవంగా జరిగే ఈ సంబరాలు ఎడిసన్‌లోని న్యూజెర్సి కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పొజిషన్‌ సెంటర్‌లో జరగనున్నాయి. సంబరాల్లో ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలను ప్రవేశపెట్టారు. అందులో అమ్మానాన్నలకు సత్కారం కార్యక్రమం ఒకటి. మాతృదేవోభవ, పితృదేవోభవ అంటారు. మనల్ని కనిపెంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లితండ్రులను గౌరవించడం మన బాధ్యత...ఆ గౌరవించడం తెలుగువాళ్ళందరూ కలిసి చేసుకునే సంబరాల వేదికపై ఎంత బాగుంటుందో ఆలోచించి నాట్స్‌ సంబరాల నిర్వాహకులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మన తల్లితండ్రులను అందరిముందు సత్కరిస్తే ఎంత బాగుంటుంది. ఈ చక్కటి ఆలోచనకు కార్యరూపమే అమ్మానాన్నకు సత్కారం. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అందరూ సంబరాలకు రావాల్సిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. 

 

 

Tags :